JAISW News Telugu

CSK Vs SRH : సండే ఈవినింగ్  చెన్నై, సన్ రైజర్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్

CSK Vs SRH

CSK Vs SRH

CSK Vs SRH : చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరగనుంది. చెన్నై టీంను గత మ్యాచ్ లో ఉప్పల్ లో చిత్తు చేసిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్ లో ఆర్సీబీతో ఓడిపోయినప్పటికీ సన్ రైజర్స్ టీంను తక్కువ అంచనా వేయడం లేదు.

ఇప్పటికే మూడు సార్లు 250 పరుగులకు పైగా సాధించిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్ రాణిస్తే మరో భారీ స్కోరు మ్యాచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు జట్లు ఇప్పటివరకు 20 సార్లు తలపడగా.. చెన్నై 14 సార్లు.. సన్ రైజర్స్ 6 సార్లు విజయం సాధించాయి. మొత్తం మీద చెన్నైదే పై చేయి.

చెన్నై ఓపెనర్లు అజింక్య రహనే, రచిన్ రవీంద్ర ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. శివమ్ దూబె దంచికొడుతున్నా.. మిగతా బ్యాటర్లు రాణిస్తేనే భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. దోని చివర్లో మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో దీపక్ చాహార్, తుషార్ దేశ్ పాండే అనుకున్నంతా స్థాయిలో రాణించడం లేదు.

సన్ రైజర్స్ బౌలింగ్ లో  నటరాజన్ ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీస్తూ రాణిస్తున్నాడు. మయంక్ మార్కండే కీలక వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇది జట్టుకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్యాట్ కమిన్స్ కూడా బౌలింగ్ లో ఫామ్ లోకి రావాల్సిన అవసరముంది. భువీ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఐపీఎల్ సీజన్ లో ఇంతవరకు ఇవ్వలేదు. షెహబాజ్, అభిషేక్ శర్మ ఇద్దరు స్పిన్ లో రాణిస్తే ఢోకా ఉండదు. సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడతాయి. చెన్నై నాలుగు విజయాలతో ఆరో స్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిచి తిరిగి పాయింట్ల పట్టికలో టాప్ 4 ప్లేస్ లోకి రావాలని అనుకుంటోంది.

Exit mobile version