JAISW News Telugu

Pushpa 2 : పుష్ప 2లో 40% దర్శకత్వం సుకుమార్ వహించలేదట?

Pushpa 2

Pushpa 2 Sukumar

Pushpa 2 : దర్శకుడు సుకుమార్ , అతని టీం గత రాత్రి పుష్ప 2 సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు సుదీర్ఘంగా మాట్లాడారు. తన సహాయ దర్శకులను పరిచయం చేస్తున్నప్పుడు సంచలన విషయం బయటపెట్టారు. సుకుమార్ తన సహాయ దర్శకుడు శ్రీమాన్ గురించి ఓ సంచలన విషయం బయటపెట్టాడు. శ్రీమాన్ దాదాపు సగం చిత్రానికి దర్శకత్వం వహించాడని ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. సుకుమార్ ఈ సందర్భంగా శ్రీమన్‌ ప్రతిభను బయటపెట్టాడు. అతని పట్ల తనకున్న ప్రగాఢ అభిమానాన్ని చాటుకున్నాడు.

చిన్ననాటి సన్నివేశాలు, ట్రక్ సీక్వెన్సులు , రెండవ యూనిట్ షాట్‌లతో సహా పుష్ప 2: ది రూల్‌లో 30 నుండి 40 శాతం శ్రీమన్ దర్శకత్వం వహించాడని సుకుమార్ వెల్లడించారు. నిజానికి టైటిల్ కార్డులో దర్శకత్వం పేర్లలో “శ్రీమాన్, సుకుమార్ ” అని టైటిల్ కార్డ్ వేయాలి అని కూడా సుకుమార్ అనడం విశేషం. ఈ ప్రశంసలతో సుకుమార్ తన అసిస్టెంట్ డైరెక్టర్‌ కు బహిరంగంగా క్రెడిట్ ఇచ్చి తన మంచి మనుసును చాటుకున్నాడు. మరి శ్రీమాన్ ఇంకో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అడుగుజాడల్లో నడుస్తాడా.. సుకుమార్ క్యాంపు నుండి తదుపరి దర్శకుడిగా మారతాడా? కాలమే సమాధానం చెప్పాలి.

Exit mobile version