AP Deputy CM office : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆఫీసు ముందు సూసైడ్ యత్నం
AP Deputy CM office : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసు ముందు ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమకు ఉన్న 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ జంట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని వాపోయారు.
ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మారడంతో డిప్యూటీ సీఎం పవన్ తమ సమస్య పరిష్కరిస్తారన్న ఆశతో క్యాంపు కార్యాలయానికి వచ్చినట్లు వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ముందున్న భవనం పైకెక్కి తమ భూమిని వైసీపీ కార్పొరేటర్ కబ్జా చేశారని వారు ఆత్మహత్యా యత్నం చేశారు. గమనించిన స్థానికులు వారి అడ్డుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లడానికే ఈ విధంగా ఆత్మహత్యా యత్నం చేశామని బాధిత జంట చెబుతోంది. అయితే వారి వివరాలు తెలియాల్సి ఉంది.