Suicide attack : బీచ్ హోటల్ లో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి

Suicide attack
Suicide attack : సోమాలియా రాజధానిలోని బీచ్ వద్ద ఉన్న ఓ హోటల్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో 32 మంది మృతి చెందారు. 62 మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. ముష్కరుల్లో ఒకరు వంటినిండా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. మిగతా ముష్కరులు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదరుగా పడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని ఎదురు కాల్పులు జరపగా ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని అల్ ఖైడా అనుబంధ సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.