Suchi Leaks : సుచీ లీక్స్ మరో సంచలన వార్త ను బయటపెట్టింది. ఈ మధ్య సైలెన్స్ గా ఉన్న సుచీ లీక్స్ మళ్లీ సంచలన ఆరోపణలతో ప్రజల ముందుకు వచ్చింది. గతంలో కోలీవుడ్ లో సుచీ లీక్స్ పెద్ద దుమారమే రేపింది. సింగర్ సుచిత్ర కోలివుడ్ లో జరుగుతున్న దారుణాలు, సెలబ్రేటీల ముసుగులో చేస్తున్న గలీజ్ పనులను బయటపెట్టింది.
తమిళ చిత్ర పరిశ్రమలో ఆమె చెప్పిన విషయాలు పెను సంచలనంగా మారాయి. ధునుష్, త్రిష, శింబు, అనిరుద్, హన్సిక, అండ్రియా, ఐశ్వర్య లాంటి టాప్ సెలబ్రెటీల జీవితాల గురించి ట్విటర్ లో బయటపెట్టడం తీవ్ర సంచలనంగా మారాయి. కేవలం ఫేమస్ కావడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని కొట్టిపారేశారు. నిజంగా ఆమెకు మతి భ్రమించడం వల్లే ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తుందని విమర్శించారు.
ఇంతకాలం చడీ చప్పుడు లేకుండా ఉన్న సుచిత్ర మళ్లీ ఓ మీడియా చానల్ ముందుకు వచ్చి ఆరోపణలు చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. ధనుష్, అనిరుధ్ ఇద్దరిని గే అని కామెంట్ చేసింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ధనుష్, ఐశ్వర్య ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకుని సంసారం చేస్తున్నారని వారిద్దరు చీట్ చేసుకుంటున్నారని వారి వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేసింది. తాజాగా ఆమె చేసిన ఆరోపణలు తమిళ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారాయి.
ఈ సారి ఎన్ని రోజులు సుచిత్ర లీక్స్ ఇస్తుందోననే కొంతమంది సెలబ్రేటీలు భయపడుతున్నారు. సుచీ లీక్స్ లో చాలా కాంట్రవర్సీ కామెంట్స్ ఉంటాయి. ఇందులో ఎంత వరకు నిజా నిజాలు ఉంటాయో తెలియదు. సినిమాల్లో నటించే వారి పర్సనల్ లైఫ్ పై కామెంట్లు చేయడం వాటిని సామాన్య ప్రజలు నమ్మడం జరుగుతుంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది నటీ నటులు చెప్పినా.. ఎక్కడ మిగతా విషయాలు బయటపడతాయోనని ఆమెపై ఫిర్యాదులు చేయడం లేదని చెబుతున్నారు.