Suchatra Ella : టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా సుచత్ర ఎల్ల ప్రమాణస్వీకారం
![Suchatra Ella](https://jaisw-media-te-bucket.s3.ap-south-1.amazonaws.com/uploads/2024/11/07180712/P-17-3.jpg)
Suchatra Ella
Suchatra Ella : టీటీడీ ధర్మకర్ల మండలి సభ్యురాలిగా భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల ప్రమాణస్వీకారం చేశారు. రంగ నాయకుల మండపంలో ఆమెతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు. అనంతరం సుచిత్ర ఎల్లకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సుచిత్ర ఎల్ల భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ గా, ఎల్ల ఫౌండేషన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ సంస్థ కొవిడ్ టీకా తయారు చేసి, ప్రపంచానికి అందించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఆమె టీటీడీ సభ్యురాలిగా పనిచేశారు.
ధర్మకర్తల మండలి సభ్యులుగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, ముని కోటేశ్వరరావు ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.