Rohit Sharma : రోహిత్ లాంటి బ్యాట్స్మెన్ కెప్టెన్ గా ఉంటే విజయాలు సాధించడం సులువు…బౌలింగ్ కోచ్
నాలుగో రోజు ఆట ఆరంభించిన తర్వాత బంగ్లాదేశ్ బ్యాటర్లను 233 పరుగులకు భారత బౌలర్లు అవుట్ చేసి ఆ తర్వాత ఇన్నింగ్స్ ని తుఫాన్ల మొదలుపెట్టారు. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ కలిసి సిక్సులు ఫోర్ లతో టి20 మ్యాచ్ తలపించేలా ఆడారు. దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్ ఉన్నట్టు అర్థమవుతుంది. బజ్బాల్ తరహాలో ఆడిన ఈ గేమ్ లో కోచ్ గంభీర్ పాత్ర ఉందని బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ అన్నాడు. కోచ్ గా గౌతమ్ గంభీర్ కెప్టెన్ గా రోహిత్ శర్మ తాము అనుకున్న ప్లాన్లను ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా సమర్థవంతులని కొనియాడాడు.
కేవలం ఒక సెషన్ లో ఆట మొత్తాన్ని మార్చేయగల శక్తి రోహిత్ శర్మకు ఉందని అన్నాడు. దూకుడైన ఆటతీరుతో యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.
మొదటి ఇన్నింగ్స్ లో 55 పరుగుల ఆధిక్యత కలుపుకొని టీం ఇండియా బౌలర్లు గొప్పగా రాణించారు. బుమ్రా, జడేజా రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ని తక్కువ పరుగులకే ఆల్ అవుట్ చేసి కేవలం 96 పరుగుల టార్గెట్ ని మూడు వికెట్లు కోల్పోయి భారత బ్యాట్స్మెన్లు ఛేదించారు. దీంతో రెండు టెస్టు సిరీస్ ల మ్యాచ్ ని టీమిండియా అలవోకగా గెలిచింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో చేరేందుకు ఒక అడుగు ముందుకు పడినట్లు అయింది.