Kishan Bagaria : చదివింది పదో తరగతి.. సంపాదించింది రూ. 400 కోట్లు
Kishan Bagaria : ఆ యువకుడు చదివింది పదో తరగతే. కానీ తన మేధస్సుతో ఏకంగా రూ. 400 కోట్ల సంస్థకు అధిపతయ్యాడు. సత్తా ఉండాలే కాని చదువుతో పనిలేదని నిరూపించాడు. సోషల్ మీడియా వేదికల కోసం ఒక ఆల్ ఇన్ వన్ యాప్ ను తయారుచేసి అందరి దృష్టిలో పడ్డాడు ఇరవై ఆరేళ్ల కిషన్ బగారియా.
ఇక అసోం రాజధాని దిస్పూర్కు 430 కిలో మీటర్ల దూరంలో ఈ యువకుడి గ్రామం ఉంటుంది. ఈ గ్రామం పేరు దిబ్రూగడ్. కిషన్ ది ఓ మధ్యతరగతి కుటుంబం. తండ్రి మహేంద్ర ఓ చిన్న వ్యాపారి. ఇక అతడి తల్లి కవితకు కిషన్ అంటే ఎంతో ప్రేమ. కొడుకును బాగా చదివించాలని అనుకునేది. కానీ ఎందుకో గాని కిషన్ కు చదువు అబ్బలేదు. ఎప్పుడూ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. వీడియో గేమ్ లు తయారు చేసే ఎలన్ మస్క్, ఫేస్ బుక్ ను సృష్టించిన మార్క్ జుకర్ బర్గ్ ను ఆదర్శంగా తీసుకున్నాడు. అయితే కిషన్ తీరును అందరూ తప్పుబట్టేవారు. చదువు రాదంటూ హేళన చేసేవారు.
ఇక కిషన్ ఏడో తరగతిలో ఉండగా, 2010లో ఆ ప్రాంతానికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఇంట్లో కంప్యూటర్కు వైఫై పెట్టించుకున్నాడు. ఇక అప్పటి నుంచి కిషన్ కంప్యూటర్ కే పరిమితమయ్యాడు. అదేమన్నా తిండి పెడుతుందా అంటూ తల్లిదండ్రులు తిడుతున్నా పట్టించుకునే వాడు కాదు. తన స్నేహితులంతా ఇంటర్ లో చేరుతున్న కిషన్ మాత్రం పట్టించుకునే వాడు కాదు. ఆ తర్వాత ఓ రోజు తాను ఏం చేయాలనుకుంటున్నాడో తల్లిదండ్రులకు చెప్పాడు. కిషన్ ఇక కంప్యూటర్ గదినే కాలేజీ గా మార్చుకున్నాడు. తన అన్న ఇంజినీరింగ్ చదువుతుంటే ఆయన చెప్పే మాటలను జాగ్రత్తగా వినేవాడు. అప్పుడే ఫోన్ లో రకరకాల మేసేజింగ్ యాప్ లు అన్నింటినీ తెరిచి చూడడం ఇబ్బంది అవుతున్నదని తెలుసుకొని తన బుర్రకు పని చెప్పాడు. ఇక 2020లో ఆల్ ఇన్ వన్ యాప్ ను తయారు చేయడం మొదలు పెట్టాడు. మొదట టెక్ట్స్. కామ్ అని పేరు పెట్టి రెండేళ్లు శ్రమించాడు. తను వాడిన తర్వాత స్నేహితులను వాడి చూడమన్నాడు. ఇక అలా తన స్నేహితులు ఈ యాప్ గురించి తెలుసుకొని అమెరికాకు ఆహ్వానించారు.
మొదట అమెరికాలోని శాన్ ప్రాన్సస్కోలో పలు కంపెనీల్లో డెమో ఇచ్చాడు. దాదాపు వంద కంపెనీలను సంప్రదించాడు. ఈ క్రమంలో గత ఆగస్టులో ఆటోమెటిక్ కంపెనీ అధినేత మ్యాట్ ములెన్వెగ్ ను కలిసి డెమో ఇచ్చాడు. ఆ తర్వాత దాదారు రూ. 416 కోట్లకు ఈ యాప్ ను కొనేందుకు ముందుకు వచ్చాడు. అలా దాన్ని ఆటోమెటిక్ అధినేత కొనుగోలు చేసి, కిషన్ ను హెడ్ గా నియమించాడు. ఈ చర్చలు జరిగినన్నీ రోజులు కిషన్ కు నిద్ర కూడా పట్టలేదు. ఈ యాప్ లో ఏ భాషలో మేజేజ్ టైప్ చేసినా ఇంగ్లిష్ లో దానంతట అదే మారిపోతుంది. టైమ్ షెడ్యూల్ పెట్టి మరి మేసేజ్ పంపిచవచ్చు. మనం చేసిన చాటింగ్ ను సమ్మరైజ్ చేయవచ్చు. ఇక దీనిని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దే పనిలో ప్రస్తుతం కిషన్ ఉన్నాడు. నిజంగా గ్రేట్ కదా..