Deputy CM Pawan : అటవీ శాఖ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం పవన్

Deputy CM Pawan
Deputy CM Pawan : అటవీ శాఖ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో అటవీ శాఖ ఉద్యోగులపై దాడిని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఆయన మాట్లాడారు. వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించవద్దన్నారు. అటవీ శాఖ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లార్సన్ బృందాన్ని పవన్ కల్యాణ్ సత్కరించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే యువతకు సహకారం అందించాలని పవన్ కల్యాణ్ కోరారు.