JAISW News Telugu

Central Govt : ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు: కేంద్ర ప్రభుత్వం

Central Govt

Central Govt

Central Govt : కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. అలాంటి ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆధార్ తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని, మరికొందరు తరచూ ఆలస్యమవుతున్నారని గుర్తించినట్లు తెలిపింది. మొబైల్ ఫోన్ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను వాడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చేయవచ్చని సూచించింది. అన్ని విభాగాలు, శాఖలు, సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికల్ని పర్యవేక్షించాలని పేర్కొంది.

ఆలస్యంగా వచ్చిన ఒక్కో రోజుకు ఒకపూట సాధారణ సెలవు (సీఎల్) చొప్పున కోత పెట్టాలి. ఒకవేళ సీఎల్ లు లేకపోతే ఆర్జిత సెలవుల నుంచి తగ్గించాలి. తగిన కారణాలు ఉన్నట్లయితే మాత్రం నెలలో గరిష్ఠంగా రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా ఆలస్యంగా రావడాన్ని క్షమించవచ్చు. ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లిపోవడాన్ని ఆలస్యంగా రావడంతో సమానంగానే చూడాలని తాజా ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Exit mobile version