Chandrababu Naidu : చంద్రబాబుపై రాళ్ల దాడికేసు.. పోలీసుల అదుపులో ముగ్గురు
Chandrababu Naidu : వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబరు 5న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. ఆ సమయంలో వాహనంపై అభివాదం చేస్తున్న చంద్రబాబుపై వీధిలైట్లు ఆర్పివేసి రాళ్లదాడికి పాల్పడ్డారు. నందిగామ రైతుబజామర్ వద్ద చందర్ల పాడు రోడ్డులో ఈ సంఘటన జరిగింది. ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. నందిగామకు చెందిన కనుకంటె సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.