Stock Market : ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతన్న తరుణంలో సూచాలు అప్రమత్తంగా కదులుతున్నాయి. ఉదయం 9.20 గంటల సమయంలో సెన్సెక్స్ 1,157 పాయింట్ల నష్టంతో 75,320 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 357 పాయింట్లు నష్టపోయి 22,906 దగ్గర సాగుతోంది. డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.
అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఆసియా-పసిఫిక్ సూచీలూ ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ బ్రెంటట్ చమురు ధర 77.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా రూ.6,850 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.1,914 కోట్ల వాటాలను కొన్నారు.