JAISW News Telugu

Mrunal Thakur : ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం ఉండాలంటే అలాంటి పనులు చెయ్యక తప్పదు : మృణాల్ ఠాకూర్

 Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur : అందాల ఆరబోతకు మాత్రమే కాకుండా, కేవలం నటనకి ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అందం మీద ఆధారపడిన హీరోయిన్లు అందం తరగిపోగానే ఇండస్ట్రీ లో కనుమరుగు అయిపోయారు. కానీ నటన కి ప్రాధాన్యత ఇచ్చిన హీరోయిన్లు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్నారు. అలా ఇండస్ట్రీ లో దశాబ్దాలు కొనసాగే సత్తా ఉన్న నేటి తరం హీరోయిన్స్ లిస్ట్ తీస్తే మృణాల్ ఠాకూర్ పేరు ముందు వరుస లో ఉంటుంది.

ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘సీతారామం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అందం తో పాటుగా, ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది.హిందీ టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్, అక్కడే సినిమాల్లో కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ అక్కడ రానటువంటి సక్సెస్, క్రేజ్ మన టాలీవుడ్ లో వచ్చింది.

ఈమె రీసెంట్ గా హీరోయిన్ గా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం కూడా పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మనమంతా ఇప్పటి దాకా యాక్టింగ్ టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం ఒక హీరోయిన్ కొనసాగగలరు అని మాట్లాడుకున్నాం. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం కొనసాగాలంటే అందం ని మైంటైన్ చెయ్యడం ముఖ్యం అని అంటుంది. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలన్నీ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే, గ్లామర్ రోల్స్ వైపు ఇప్పటి వరకు పోలేదు. అలాంటి హీరోయిన్ నుండి ఇలాంటి మాటలు ఊహించలేదని ఆమె అభిమానులు అంటున్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘గ్లామర్ మైంటైన్ చెయ్యడానికి నేను ముఖానికి పసుపు రాసుకుంటాను, తాజా పండ్లతో ఫేషియల్ చేసుకుంటాను..అలాగే నా ముఖం కాంతివంతంగా కనిపించడానికి అప్పుడే కడిగిన బియ్యం నీళ్లను నా ముఖం పై చల్లుకుంటాను, ఇది కొరియన్ చిట్కా’ అంటూ చెప్పుకొచ్చింది. మీ ముఖం కూడా అందంగా కనిపించాలంటే పైన మృణాల్ ఠాకూర్ చెప్పిన చిట్కాలను అనుసరించి చూడండి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా వచ్చే నెల 18 వ తారీఖున విడుదల కాబోతుంది.

Exit mobile version