Pawan Kalyan : రాష్ట్రాభివృద్ధికి నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే అంశంపై విజయవాడలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏ పనైనా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ముఖ్యమన్నారు. పర్యావరణం బాగుండాలని కోరుకునే వాళ్లలో తానూ ఒకరని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అందరి సలహాలు, సూచనలు అవసరమని పేర్కొన్నారు. సరైన నిర్ణయంతోనే మంచి ఫలితాలు వస్తాయని పవన్ చెప్పారు. నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు రాష్ట్రాభివృద్ధికి అవసరం అన్నారు. మేం చెప్పడానికి కాదు, వినేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్కోసారి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని భయమేస్తున్నదని, కాలుష్యం పెరుగుతున్నదని పవన్ కల్యాణ్ తెలిపారు.