JAISW News Telugu

Star Heroine Husband : స్టార్ హీరోయిన్ భర్తకు అరుదైన వ్యాధి.. మాట్లాడలేపోతున్నానంటూ వీడియో రిలీజ్

Star Heroine Husband

Priyanka chopra-Nick Jonas

Star Heroine Husband : బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన హీరోయిన్ ప్రియాంక చోప్రా.  ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. మొన్నటివరకు బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్నది. ఆతర్వాత హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నది.  ప్రియాంక చోప్రాకు  ఇండియాలో చాలా క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ చిత్రాల్లనూ నటించింది. పలు సినిమాల్లో ప్రత్యేక పాట్లోల నర్తించింది.  బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా.

హాలీవుడ్ లో స్టార్ హీరోలతో  సిటాడెల్-2, బే వాచ్, క్వాంటికో సినిమాలతో మరింత స్టా్ర్ డమ్ సంపాదించింది. అయితే  కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నది ప్రియాంక. వయసులో తనకన్న పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడింది. అప్పట్లో ఈ వివాహం పెద్ద దుమారాన్నే రేపింది.  

ఈ జంట ప్రస్తుతం అమెరికాలో సెటిలైంది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. చాలా కాలంగా ప్రియాంక ఇండియాకు రావడం లేదు. ఇటీవల ప్రియాంక అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.  ప్రస్తుతం ప్రియాంక సినిమాలు చేస్తున్నది. ప్రియాంక భర్త నిక్ జోనస్ కు అరుదైన వ్యాధి ఉందని  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. దాంతో నిక్ జోనాస్ ఆరోగ్యానికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతున్నది.

తాజాగా నిక్ జోనాస్ తన ఆరోగ్యంపై ఇన్‌స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. నిక్ జోనాస్ ఇన్‌ఫ్లుఎంజా-ఎ తో బాధపడుతున్నట్లు తన పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. దీంతో తాను మ్యూజిక్ షో చేయలేకపోతున్నానని ఓ వీడియో షేర్ చేశాడు. అలాగే ఈ వీడియోలో తన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. ” హాయ్ గాయ్స్.. నా ఆరోగ్యం బాగా మందగించింది.. తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్న. ఏం  మాట్లాడలేకపోతున్న. అలాగే జ్వరం, దగ్గుతో బాధపడుతున్న.. డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమని సూచించారు. దీంతో  నా ప్రోగ్రామ్స్ అన్ని రీ షెడ్యూల్ చేస్తున్న.  ఆగస్టులో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాను.. నన్ను క్షమించండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు ప్రియాకం భర్త.

Exit mobile version