JAISW News Telugu

Star Heroine : 17 ఏళ్ల వైవాహిక బంధానికి స్టార్ హీరోయిన్ బ్రేకప్

Star Heroine

Star Heroine Aishwarya Rai

Star Heroine : భారతీయ సినీ పరిశ్రమలో ఐశ్వర్యారాయ్ కు ప్రత్యేక స్థానం ఉంది. కొంత కాలంగా ఈ మాజీ ప్రపంచ సుందరి వైవాహిక బంధంపై అటు  మెయిన్ స్ర్టీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. బాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ గా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లకు పేరుంది.  అయితే వీరు కొంతకాలంగా  వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె సంపాదన, నికర ఆస్తుల వ్యవహారం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచంలోనే అత్యంత  సౌందర్యరాశిగా పేరుగాంచిన ఐశ్వర్యరాయ్ వైవాహిక జీవితంలోల సందిగ్ధం నెలకొందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్నది. దీనిపై అటు బచ్చన్ ఫ్యామిలీ గానీ, ఇటు ఐశ్వర్య గానీ స్పందించడం లేదు. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య సినిమాలు చేస్తూ వస్తున్నది. కొంత కాలంగా సినిమాలను తగ్గించింది. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నది. గతేడాది మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఐశ్వర్య మళ్లీ తెరమీద కనిపించ లేదు.

ఐశ్వర్యకు సినిమా రంగంలో  ఇప్పటికీ డిమాండ్‌ ఉంది. ఒక్కో సినిమాకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాకు దాదాపు రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సినీ వర్గాలు వెల్లడించాయి.  ఇక కమిర్షియల్ యాడ్స్ లోనూ  ఐశ్వర్య కు డిమాండ్ ఉంది. ఒక్కో బ్రాండ్‌కు భారీగా చార్జ్ చేస్తున్నది. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కు దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఐశ్వర్య రాయ్ కు వ్యక్తిగతంగా పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. ఆమె పేరిట కోట్లాది రూపాయలు ఆస్తులు రిజిస్టర్ ఉన్నాయని తెలుస్తున్నద. తాజా సమాచారం ప్రకారం.. ఐశ్వర్య నికర ఆవిలువ రూ. 850 కోట్ల పై మాటే.  ప్రస్తుతం హీరోయిన్లలో అత్యధిక ఆస్తులు ఉన్న వారిలో ఐశ్వర్య రాయ్ ముందున్నారు.

Exit mobile version