Heroine affair : ఓ తమిళ స్టార్ హీరోయిన్ తన ఎఫైర్ గురించి తానే సోషల్ మీడియాలో బయటపెట్టుకుంది. తమిళంలో సింగర్‌గా కెరీర్ ప్రారంభించి మొదలుపెట్టిన ఆ తర్వాత లిరిక్ రైటర్‌గా మారింది. అక్కడితో ఆగని ఈ భామ హీరోయిన్ గా పలు చిత్రాలు చేసింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా. స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆండ్రియా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె బోల్డ్ గ్లామరే.
అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గదు ఆండ్రియా. ఆన్ స్ర్కీన్ మీద రొమాన్స్ లో రెచ్చిపోతుంది. ఏ మాత్రం హద్దుల పెట్టుకోదు. కొద్ది రోజుల క్రితం శృంగారం గురించి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. గతంలో తాను ఓ వ్యక్తి వల్ల ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది. ఓ పెళ్లైన వ్యక్తితో తాను ఎఫైర్ పెట్టుకున్నాని చెప్పుకొచ్చింది. అతను తనను శారీరకంగా చాలా హింసించాడని వాపోయింది. టార్చర్ భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అతడిని భరించలేక దూరంగా ఉంటున్నట్లు చెప్పింది.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ఆండ్రియా ఎఫైర్ సాగించిందని అప్పట్లో గాసిప్స్ వచ్చాయి. వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇక తనకు ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదని వెల్లడించించింది. 20-25 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలనుకున్నానని, అప్పుడు కుదరలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటానో లేదో తెలియదని, కానీ పెళ్లి కాకపోయినా సంతోషంగా ఉంటానని మాత్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్న హాట్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నది.