Big directors : పెద్ద డైరెక్టర్లను పట్టించుకోని స్టార్ హీరోలు.. ఎందుకో తెలుసా?
big directors : దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినీ ఇండస్ట్రీ వాళ్లకు చక్కగా సరిపోతుంది. ఈ విధానం కేవలం ఆర్టిస్టులకే కాదు దర్శకులకు కూడా వర్తిస్తుంది. ఒక యువ దర్శకుడు పెద్ద హిట్ కొట్టగానే మరో సినిమా తీస్తే అది సక్సెస్ అయితే ఓకే. కానీ ఫెయిల్ అయితే మాత్రం అతడి వైపు ఎవరూ చూడరు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు కొట్టిన వీవీ వినాయక్, పూరి జగన్నాథ్ లాంటి వారు చాలా ఏండ్ల నుంచి పెద్ద హిట్ లేక తడబడుతున్నారు.
వీవీ వినాయక్ ఠాగూర్ లాంటి సినిమాను తీసి అందరి హృదయాలను దోచుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనకు సినిమాలే రావడం లేదు. బృందావనం తీసిన పైడిపల్లి వంశీకృష్ణ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేక వారి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
కానీ పెద్ద హీరోలు ఎవరూ కూడా వీరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇంత వరకు వాస్తవమో తెలియక పోయినా సినిమా రంగంలో నిజంగానే ఇలా జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. స్టార్ హీరోలు ప్రస్తుతం ఎవరైతే సినిమా రంగంలో దూసుకుపోతున్నారో వారి పైనే నమ్మకం పెట్టుకుని వారి మాత్రమే చాన్స్ లు ఇస్తున్నారు. కానీ గతంలో పెద్ద హిట్ లు అందించిన వారికి మాత్రం ఇవ్వడం లేదు. కాగా ఈ డైరెక్టర్లు మీడియం రేంజ్ సినిమాలు చేయడం కరెక్ట్ అని వారి అభిమానులు అనుకుంటున్నారు.
ఇప్పుడు పెద్ద స్టార్ల గురించి పట్టించుకోకుండా కేవలం సినిమాలు చేస్తూ వెళ్లాలని అప్పుడు మళ్లీ విజయాలు సాధిస్తే మళ్లీ పెద్ద హీరోలు కూడా పిలుస్తారని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు మాత్రం అందుకే చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారని అభిమానులు చెబుతున్నారు. కాగా సినిమాలు చేసే విషయంలో స్టార్ హీరోలు పెద్ద డైరెక్టర్లను కూడా చూడాలని సలహా ఇస్తున్నారు.