Sukumar : సుకుమార్ కోసం టైమ్ వేస్ట్ చేసుకున్న స్టార్ హీరో…

Sukumar

Sukumar

Director Sukumar : విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుందని సుకుమార్ గతంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే విజయ్ కూడా సుకుమార్ కోసం ఎదురు చూశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ రద్దయింది. నిజానికి సుకుమార్ సినిమా చేస్తున్నానని విజయ్ దేవరకొండ ఇతర దర్శకుల సినిమాలను వదులుకున్నాడు. కానీ సుకుమార్ చివరి నిమిషంలో సినిమా చేయకపోవడంతో ఆయన ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్ డమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఒకవేళ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసి ఉంటే, విజయ్ స్టార్ హీరోగా మారేవాడని భావిస్తున్నారు. కానీ ఆయన మీడియం రేంజ్ దర్శకులతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

TAGS