Vijay Kanth Is Seriously Ill : ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల గురించి వారి ఫ్యాన్స్ కు వినలేని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ ఇండస్ట్రీలో చూసిన వరుసగా విషాదకరమైన వార్తలే వినిపిస్తున్నాయి.. ఈ వార్తలతో ఫ్యాన్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో హీరో గురించి మరో విషాద ఘటన తెలుస్తుంది.
తమిళ్ హీరో డీఎండీకే అధినేత విజయకాంత్ కు అస్వస్థత అనే న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ తమిళ్ హీరో ఫ్యాన్స్ మొత్తం ఈ వార్త విని షాక్ అవుతున్నారు. ఈయన తీవ్ర అస్వస్ధతకు గురి అవ్వడం వల్ల చెన్నయ్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారట.
విజయకాంత్ కు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా పార్టీకి దూరం అయ్యారు.. దీంతో పార్టీ పూర్తి బాధ్యత ప్రస్తుతం ఆయన భార్య ప్రేమలత చూస్తున్నారు. ఇటీవల జరిగిన జన్మదిన వేడుకల్లో విజయకాంత్ కూడా పాల్గొన్నారు.. ఇంతలోనే విజయకాంత్ కు తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో అభిమానులు అలాగే డీఎండీకే కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు.