Rave Party : రేవ్ పార్టీలో స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో తనయ?
Rave Party : బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీపై సీసీబీ బృందం దాడి చేసింది. తెల్లవారుజామున 3 గంటలకు సీసీబీ పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశాడు. ఈ దాడిలో పార్టీలో డ్రగ్స్ లభించాయి. ఇక ఈ పార్టీలో కొందరు తెలుగు యాక్టర్లు కూడా ఉన్నట్లు సమాచారం. కాన్ కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందిన జీఆర్ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన వాసు ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. తన బర్త్ డే పార్టీ పేరుతో సాగుతున్న ఈ రేవ్ పార్టీ అర్ధరాత్రి 2 గంటలు దాటినా ముగియలేదు. సమయం దాటినా పార్టీ మూడ్ నుంచి బయటికి రాలేదు. దీంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ దొరికాయని తెలుస్తున్నది. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా యువతీయువకులు, 25 మందికి పైగా సినీ తారలు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తున్నది. వీరంతా ఆంధ్రా నుంచి విమానంలో వచ్చినట్టు తెలుస్తున్నది.
దాడి జరిగిన ఫామ్‌హౌస్ సమీపంలో మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ఆడి కార్లు సహా పదిహేనుకు పైగా లగ్జరీ కార్లు అక్కడ ఉన్నాయి. ఈ పార్టీలో మోడల్స్, టెక్కీలు కూడా పాల్గొన్నారు. తెలుగు టీవీ, సినిమా నటీమణులు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ ఠాణాలో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
పట్టుబడిన వారిలో స్టార్ హీరో కూతురు
రేవ్ పార్టీలో ఓ స్టార్ హీరో కూతురుతో పాటు అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కూడా ఇందులో ఉన్నట్లు వార్తలు రావడంతో కన్నడ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వీరంతా డ్రగ్స్ తీసుకొని బాగా ఎంజాయ్ చేశారని తెలుస్తున్నది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖలు ఇందులో పాల్గొన్నారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆదివారం సాయంత్రం ఐదు నుంచి ఉదయం ఆరు గంటల వరకు పార్టీ జరగాల్సి ఉంది. ప్రస్తుతం సీసీబీ పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి అక్రమాస్తులను బట్టబయలు చేశారు. నగరంలో నిత్యం దాడులు జరుగుతున్నా శివారు ప్రాంతాల్లో పార్టీ ఏర్పాటు చేయడం గమనార్హం. దాదాపు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు చేసి ఒక్కరోజు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ బృందం తనిఖీ చేస్తున్నది. పార్టీకి హాజరైన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.