SSMB29 : చిలుకూరి బాలాజీ దేవాలయంలో మహేష్-రాజమౌళీ మూవీ హీరోయిన్
SSMB29 : నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్లోని చిలుకూర్ బాలాజీ ఆలయాన్ని సందర్శించి తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆమె ‘కొత్త అధ్యాయం’ అంటే ఏమిటో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ప్రముఖంగా ప్రస్తావించనప్పటికీ SS రాజమౌళి – మహేష్ బాబులతో తన సినిమాను అధికారికంగా ధృవీకరించడం ఇదే కావచ్చు అని అందరూ భావిస్తున్నార.
నీలిరంగు పాస్టెల్ సల్వార్ సూట్ సెట్ ధరించిన ప్రియాంక చోప్రా తన ఆలయ సందర్శన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “శ్రీ బాలాజీ ఆశీస్సులతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మనమందరం మన హృదయాలలో శాంతి -శ్రేయస్సు -సమృద్ధిని పొందుదాం. దేవుడి దయ అనంతం ఉంటంది” అని ప్రియాంక ఫోటోలను పంచుకుంటూ రాసుకొచ్చార.
SS రాజమౌళి -మహేష్ బాబు మూవీ SSMB29 షూటింగ్ గురించి తన ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ జనవరి 17న ప్రియాంక హైదరాబాద్ చేరుకుంది. అయితే ఇప్పటివరకూ అధికారికంగా మహేష్ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక అన్నది కన్ఫమ్ చేయలేదు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి తారాగణం.. సిబ్బందిని ఇంకా వెల్లడించలేదు.
SSMB29 విభిన్న స్టోరీతో వస్తోందని అంటున్నారు. అదనపు తారాగణం – కథాంశం గురించిన వివరాలు బయటపెట్టలేదు.