
Srivari Mettu road
Srivari Mettu road Closed : భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి మెట్టు కాలినడక మార్గాన్ని టీటీడీ మూసివేసింది. కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జాం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటోంది. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలుగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు వాయుగుండం తీరం దాటాక వర్షాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.