JAISW News Telugu

Bhanuprakash Reddy : శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి

Bhanuprakash Reddy : తిరుమల శ్రీవారి భద్రతపై భక్తుల్లో అనుమానాలున్నాయని, కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైసీపీ అధర్మ క్షేత్రంగా మార్చిందని ధ్వజమెత్తారు.

శ్రీవారి ఆభరణాలపై భక్తులకు అనుమానాలు ఉన్నాయన్నారు. దర్శన టికెట్ల నుంచి ఇంజనీరింగ్ పనుల వరకు అన్నింటిలోనూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో దండుకున్నారని చెప్పారు. గతంలో టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై తనకు నమ్మకం లేదని, సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version