Srivari Brahmotsavam : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా మహా రథోత్సవం

Srivari Brahmotsavam
Srivari Brahmotsavam : శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరులలో వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయజయధ్వానాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు.
శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శనివారం చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేశారు.