Sriramulu Yadav : మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటా తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా తన గెలుపుకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు తన విజయానికి దోహదం చేస్తాయని నమ్ముతున్నారు.
మహేశ్వరంలో మహామహులు ఉన్నా తన గెలుపు సునాయాసమే అంటున్నారు. వారి మైనస్ తనకు ప్లస్ గా మారుతుందని చెబుతున్నారు. ఓటర్ల మనసు తనకు తెలుసని గుర్తు చేసుకున్నారు. తన స్టామీనా చూసే అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందన్నారు. ఈనేపథ్యంలో శ్రీరాములు యాదవ్ నియోజకవర్గంలో గడపగడపకు తిరిగారు.
మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. బీజేపీ విధానాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్నారు. మిగతా అభ్యర్థులకంటే ముందంజలో నిలుస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా మారారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు వేయాలని కోరారు.
కేంద్ర మంత్రులు కూడా పర్యటించి శ్రీరాములు యాదవ్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ కు అన్ని ప్రతికూల అంశాలుగానే మారాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉద్యోగాల నోటిఫికేషన్, కాళేశ్వరం పథకం లాంటివి మైనస్ గా పరిణమించాయి. రుణమాఫీ కూడా అందరికి ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థికి ఇవి ప్లస్ గా మారుతున్నాయి.