Srinivasananda Saraswati : ఆచార, సంప్రదాయాలను మంటగలిపిన వైసీపీ – శ్రీనివాసానంద సరస్వతి

Srinivasananda Saraswati
Srinivasananda Saraswati : గత ఐదేళ్ల పాలనలో ఆచార, సంప్రదాయాలను మంటగలిపారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. ఆలయాల్లో అర్చకులపై వైసీపీ నేతలు దాడులు చేశారని, దీంతో రాష్ట్రం అట్టుడికిపోయిందని తెలపారు. శ్రీకాకుళంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
‘‘జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటమాడారు. ఆచార, సంప్రదాయాలను మంటగలిపారు. హిందూ ధర్మాన్ని తుడిచి పెట్టేయాలని చూశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో దాడులు చేసిన వారిని ఇప్పటికీ శిక్షించలేదు. టీటీడీని అపవిత్రం చేశారు. తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చేశారు. చంద్రబాబు పాలనలో తిరుమల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ దుర్మార్గ పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పాలి. ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ఎన్డీయే కూటమికి ఓటు వేయాలి. చంద్రబాబును సీఎం చేయాలి’’ అని శ్రీనివాసానంద సరస్వతి పిలుపునిచ్చారు.