Sridevi son Dating : ఈమధ్య కాలం లో కొడుకు వయస్సు ఉన్న వారితో కూడా సినీ ఇండస్ట్రీ లో డేటింగ్ చేసేస్తున్నారు. ఇలా బయట మన జీవితాల్లో జరిగితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. కానీ సినిమా వాళ్లకు మాత్రం ఇది చాలా కామన్ అయిపోయింది. ఉదాహరణకి శ్రీదేవి కొడుకు అర్జున్ కపూర్ 57 ఏళ్ళ స్టార్ హీరోయిన్ తో 17 సంవత్సరాల నుండి డేటింగ్ చేస్తూ వస్తున్నాడు.
శ్రీదేవి కొడుకు అంటున్నాడు ఏంటి, శ్రీదేవి కి కేవలం కూతుర్లే కదా ఉన్నది అని మీరు అనుకోవచ్చు. కానీ అర్జున్ కపూర్ బోణీ కపూర్ మొదటి భార్య కొడుకు. ఎంత కాదు అనుకున్నా కూడా అర్జున్ కపూర్ వరుసకు శ్రీదేవికి కొడుకే అవుతాడు కదా. అదంతా పక్కన పెడితే 17 ఏళ్ళ నుండి డేటింగ్ చేసుకుంటున్న ఈ ఇద్దరూ, అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం విశేషం. వీళ్లిద్దరికీ ఎలాంటి సంతానం కూడా లేదు.
ఇలా ఇన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేసుకుంటూ ఇప్పటి వరకు పిల్లల్ని కనకుండా ఉన్న ఏకైక జంట వీళ్ళిద్దరిదే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే గత ఆరు నెలల క్రితం వీళ్లిద్దరికీ మధ్య బ్రేకప్ అయ్యిందని, ఇప్పుడు మలైకా అరోరా అర్జున్ కపూర్ తో కలిసి ఉండడం లేదని లేటెస్ట్ గా బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. సోషల్ మీడియా లో ఎప్పుడూ కలిసి ఉండే ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఉండే ఈ జంట, ఈమధ్య కాలం లో ఎవరి దారి వారిదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా రీసెంట్ గా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మలైకా అరోరా పోస్ట్ చేసిన ఫోటోలలో అర్జున్ కపూర్ ఎక్కడా కనిపించడు. ఆప్తులతో జరుపుకునే పండగల్లో కూడా కలిసి లేరంటే కచ్చితంగా వీళ్లిద్దరు విడిపోయారని బాలీవుడ్ లో పెద్ద టాక్ నడుస్తుంది.
దీనిపై అటు మలైకా అరోరా కానీ, అర్జున్ కపూర్ కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అంటే వీళ్ళు విడిపోయిన విషయం నిజమే అన్నమాట. మలైకా అరోరా గతం లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని ప్రేమించి పెళ్లాడింది. కానీ అతనితో కొన్ని విబేధాల కారణం గా విడిపోవడం తో, అప్పటి నుండి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ వచ్చింది మలైకా అరోరా. ఇప్పుడు అతనితో కూడా బ్రేకప్ అయిపోయింది అనే వార్తలు రావడం తో ఇప్పుడు ఆమె దారి ఎటు అని అడుగుతున్నారు నెటిజెన్స్.