JAISW News Telugu

Sridevi : శ్రీదేవికి అహంకారం ఎక్కువ.. అందుకే కలవలేకపోయాం : జయప్రద

Sridevi

Sridevi and Jayaprada

Sridevi ad Jayaprada : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి. ఒక ఇంటర్వ్యూలో మరో సీనియర్ హీరోయిన్ జయప్రద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శ్రీదేవికి చాలా అహంకారం ఉండేదట.  మరీముఖ్యంగా కొంత మంది హీరోయిన్లను శ్రీదేవీ లెక్కచేసేవారు కాదట. జయప్రదతో శ్రీదేవి ఏమాత్రం సఖ్యతగా ఉండేవారు కాదట. సినిమా షూటింగ్ ఉంటే.. షూటింగ్ లో .. సీన్ లో మాత్రమే చాలా దగ్గర మనిషిలా ఉండేవారట. ఆ తరువాత జయప్రద ఒక చోట కూర్చుంటే.. శ్రీదేవి ఆమెకు దూరంగా వెళ్లి వేరే కుర్చీలో కూర్చునే వారట. కనీసం పలకరింపు కూడా ఉండేది కాదట. ఇక చాలామంది విషయంలో శ్రీదేవి అలానే ప్రవర్తించేవారట. ఎన్ని సినిమాలు కలిసి చేసినా.. ప్రతీ సినిమాకు ఎవరో ఒకరు వచ్చి… ఇదిగో జయప్రద గారు అని పరిచయం చేయాల్సి వచ్చేదట. అయినా మాట్లాడేది కాదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జయప్రద వెల్లడించారు.

తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసి అతిలోక సుందరి ట్యాగ్ అందుకుంది శ్రీదేవి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతిలోక సుందరిగా పేరు పొందిన హీరోయిన్ శ్రీదేవి ఒక్కతే. ఆమె అందాన్ని గంధర్వ కాంతలతో పోల్చుతుంటారు.  అంతలా అభిమానులను తన మైకంలో ముంచిన తార.. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన స్టార్ డమ్ ను కొనసాగించింది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి 50 ఏళ్లకే కన్నుమూసి.. అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తింది.

Exit mobile version