Sri Reddy : శ్రీరెడ్డికి ఇక ఉందిగా..బూతుల రాణిపై తొలి కేసు నమోదు
Sri Reddy : బూతుల రాణి శ్రీరెడ్డి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. వైసీపీ తరపున బూతుపురాణం అందుకొన్నవారిలో ముందు వరుసలో ఉంటుంది. మిగిలిన నాయుకులకు కాస్తో కూస్తో సెన్సార్ ఉంది. శ్రీరెడ్డికి అదీ లేదు. చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోవడం, నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం ఇదే పనిగా పెట్టుకొంది. చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్‌లపై చాలాసార్లు అనుచిత వ్యాఖ్యలు చేసింది. కొన్నాళ్లకు శ్రీరెడ్డి అంటేనే అసహ్యం ఏవగింపు పుట్టుకొచ్చేశాయి. ఎన్నికలు, రిజల్ట్ తరవాత అందరిలానే శ్రీరెడ్డి నోరు మూసుకుపోయింది. బయటా కనిపించడం లేదు. బయటకొస్తే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో తనకు తెలుసు. అందుకే అండర్ గ్రౌండ్ లోనే ఉంటోంది.
ప్రభుత్వం మారితే… శ్రీరెడ్డి జాతకం ఎలా ఉంటుందో అని చాలామంది ఊహించారు. ఆమె ఊచలు లెక్కపెట్టడం ఖాయమని భావించారు. ఇప్పుడు అదే జరగబోతోంది. శ్రీరెడ్డిపై ఏపీలో తొలిసారి ఓ కేసు నమోదైంది. ఎన్నికల ముందు, ఆ తరవాత చంద్రబాబు, లోకేష్, పవన్, అనితలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కర్నూలు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీరెడ్డిపై ఎఫ్.ఐ.ఆర్ రాసి కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిని త్వరలోనే అదుపులో తీసుకొని విచారిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ పరంపర కేవలం శ్రీరెడ్డితోనే ఆగదు. యూ ట్యూబ్ సాక్షిగా రెచ్యిపోయిన చాలామంది వైసీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పకుండా చర్యలు ఉంటాయని, వాళ్లని న్యాయబద్ధంగానే ఎదుర్కొంటామని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.
జగన్ పాలనలో రెచ్చిపోయిన శ్రీరెడ్డి ఇక కష్టాలు తప్పవంటున్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోపలేయడం తప్పదంటున్నారు. నోటి దురదను ఇప్పటికైనా తగ్గించుకోవాలని టీడీపీ, జనసేన కార్యకర్తలు సూచిస్తున్నారు.