Brahmotsavalu : నేటి నుంచి శ్రీ రామానుజాచార్యుల బ్ర‌హ్మోత్స‌వాలు..మార్చి 1న సమతా కుంభ్..

Brahmotsavalu

Brahmotsavalu

Brahmotsavalu : నేటి నుంచి శ్రీ‌రామానుజార్యుల 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్ర‌హో త్స‌వాలు మార్చి ఒక‌టి వ‌ర‌కు కొన‌సాగుతా యి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ శ్రీ రా మనగరంలో శ్రీ రామానుజాచార్యుల 216 అడుగు ల విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే. ఈ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ జ‌రిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమతా కుంభ్ 2024 నిర్వహిస్తు న్నా రు. ఈ సంద‌ర్భంగా మంగళవారం నుంచి మార్చి 1 వరకు శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

ఈ బ్రహ్మోత్స‌వాలు 11 రోజుల పాటు జ‌ర‌గ‌ను న్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి సమ తా కుంభ్ 2024కు శ్రీకారం చుట్టారు. ఈ బ్ర‌హ్మో త్స‌వాల్లో భాగంగా ఫిబ్రవరి 25న 108 దివ్యదేశాల మూర్తులకు ఒకేసారి శాంతి కల్యాణం జరిపించే ఏర్పాట్లు చేయ‌నున్నారు. 11 రోజుల పాటు జరిగే శ్రీ రామానుజాచార్యుల బ్రహ్మోత్సవాలకు దేశవిదే శాల నుంచి భక్తులు త‌ర‌లిరానున్నారు. మంగళ వారం రామానుజాచార్యులకు అభిషేకంతో సమ తా కుంభ్-2024 ప్రారంభం కానుంది.

శ్రీ రామానుజాచార్య సమతా భావాన్ని ప్రపం చానికి చాటిచెప్పేందుకు, సమాజంలో సమాతా స్పూర్తిని నింపేందుకు 216అడుగుల శ్రీ రామా నుజాచార్యుల విగ్రహాన్ని తెలంగాణ‌లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ జ‌రిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమతా కుంభ్ 2024 నిర్వహిస్తున్నారు. స‌మ‌తా కుంభ్‌లో భాగం గా తోమ్మిది కుండాలతో ఒక యాగశాలను ఏర్పా టు చేయ‌నున్నారు. ప్రతిరోజూ స్వామివారికి 18 మంది గరుత్మంతులతో గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 21న సూర్యప్రభ వాహనసేవతో పాటు శేష వాహన సేవ, 25వ తేదీన 108 దివ్యదేశాల మూర్తులకు ఒకేసారి శాంతి కల్యాణం జరిపించ‌ న‌నున్నారు.ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 11.30 గంటలకు వసంతోత్సవంతో పాటు సాకేత రామ చంద్రప్రభువుకు గరుడ సేవ నిర్వహించనున్నారు. 27న డోలోత్సవం, అశ్వ వాహనసేవ, ఫిభ్రవరి 28న తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు.

ఇక‌, ఈ నెల 29న ఉద‌యం 9కి శ్రీ సాకేత రామచం ద్రప్రభువుకు రథోత్సవం, విరజా పుష్కరి ణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. వ‌చ్చే నెల 1న శ్రీ పుష్ప యాగం నిర్వహించి, సాయంత్రం మహా పూర్ణా హుతి కార్యక్రమంతో సమతా కుంభ్ -2024 ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల పాటు దేశ విదేశాల నుంచి వచ్చే కళాకారులచేత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

TAGS