JAISW News Telugu

Sri Rama Puttabhishekam : ఎడిసన్ SDP SSV దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో శ్రీ రామ పుట్టభిషేకం

Sri Rama Puttabhishekam

Sri Rama Puttabhishekam

Sri Rama Puttabhishekam : అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం, ఎడిసన్ నగరంలోని SDP SSV దేవస్థానంలో ఈ ఏడాది శ్రీ సీతారామ కళ్యాణం , శ్రీ రామ పుట్టభిషేకం మహోత్సవాలు అతి వైభవంగా జరిగాయి..

భక్తులందరికి ఇది ఒక ఆధ్యాత్మిక ఉత్సవంగా అనుభూతి పొందారు. తన్మయత్వం చెందారు. ఈ వేడుకల్లో యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి గారు పాల్గొని పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనకు దేవుడి చిత్రపటాలు జ్ఞాపికలు అందజేశారు.

– శ్రీ సీతారామ కళ్యాణం

ఏప్రిల్ 5, 2025 (శనివారం) ఉదయం 10:00 గంటల నుండి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది… వేద ఘోషలు, మంగళవాయిద్యాలు మధ్య శ్రీ రాముడు మరియు సీతామాతల వివాహం ఎంతో శ్రద్ధాభక్తులతో జరిగింది. భక్తులు ఈ వేడుకలో పాల్గొనడం ద్వారా దైవిక కృపకు పాత్రులయ్యారు.

– శ్రీ రామ పుట్టభిషేకం

ఇదే రోజు సాయంత్రం 6:00 గంటల నుండి శ్రీ రామ పుట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో శ్రీరామునికి పట్టాభిషేకం చేసి ఆయన్ని అయోధ్యాధిపతిగా అభిషేకించబడే విధంగా నిర్వహించారు. ఇది రామరాజ్య స్థాపనకు ప్రతీకగా పరిగణించబడిందని భక్తులు సంబరంగా ఉత్సవం జరుపుకున్నారు.

ఈ రెండు మహోత్సవాలు శ్రీరాముని జీవితం నుండి అత్యంత కీలకమైన ఘట్టాలను గుర్తు చేస్తాయి. దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లను భక్తుల సౌకర్యార్థం శ్రద్ధగా నిర్వహిస్తోంది.

మీ కుటుంబసభ్యులతో కలిసి ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొని శ్రీరాముని అనుగ్రహాన్ని పొందండి.

స్థలం:
SDP SSV Temple, Edison, New Jersey
తేదీ: ఏప్రిల్ 5, 2025

శ్రీ సీతారామ కళ్యాణం: ఉదయం 10:00 గంటలకు ఘనంగా జరిగింది. ఇక శ్రీ రామ పుట్టాభిషేకం సాయంత్రం 6:00 గంటలకు కన్నుల పండువగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి గారితోపాటు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ దేవుడి కృపకు బాధ్యులయ్యారు.

More Photos : Sri Rama Pattabhishekam at SDP SSV Temple Edison NJ PHOTOS

All Image Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

Exit mobile version