Anchor Sreemukhi : శ్రీముఖి ట్రెండీ లుక్స్.. మరింత అందంగా ముద్దు గుమ్మ.. వైరల్ పిక్స్..
Anchor Sreemukhi : యాంకర్ సుమ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది శ్రీముఖి. బుల్లితెరపై ఆమె సంపాదించుకున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాములమ్మ పాట స్టెప్పులతో ఊపు ఊపిన శ్రీముఖిని బుల్లితెర రాములమ్మగా పిలుచుకుంటారు. ప్రముఖంగా ఈటీవీలో ప్రసారమయ్యే షోలలో కనిపించే శ్రీముఖి ఇండియాన్ ఐడల్ షోలలో కూడా కనిపించి సందడి చేసింది. ఇక్కడే కాకుండా విదేశాలలకు వెళ్లి సైతం షోలు చేస్తుంటుంది.
యాంకరింగ్ ను కెరీర్ గా మలుచుకున్నప్పటి నుంచి ఆమె దూసుకుపోతోంది. వెండితెరపై అవకాశాలను కూడా వదులుకోవడం లేదు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ‘జులాయి’లో హీరో చెల్లెలి పాత్రలో నటించింది. ఈ పాత్రను చూసిన వారు శ్రీముఖేనా? అని ఆశ్యర్యపోవాల్సిందే. ఆ తర్వాత ‘లవ్ ఇష్క్ కాదల్’తో హీరోయిన్ గా మారింది.
తెలంగాణ బిడ్డ అయిన శ్రీముఖికి వెండితెరపై కనిపించాలని బల్యాం నుంచే కోరిక ఉండేదట. ఆ మేరకు కష్టపడి ఇష్టపడిన రంగంలో ప్రతిభ చూపింది. చదువులో చురుగ్గా ఉండే బుల్లితెర రాములమ్మ వైద్య విద్యను అభ్యసించేందుకు సిద్ధమైంది. అందుకు బీడీఎస్ లో కూడా సీటు దక్కించుకుంది. కానీ మధ్యలో బుల్లితెరపై కనిపించే ఆఫర్లు వస్తుండడంతో అటువైపు వెళ్లలేదు.
అయితే, ఒక స్టార్ ప్రొడ్యూసర్ రిలేటివ్ తనను వివాహం చేసుకోబోతున్నాడని అప్పట్లో పుకార్లు వచ్చాయి. వాటిని ఆమె ఖండించింది. ఆయనను వివాహం చేసుకుంటే ఇండస్ట్రీలో తిరుగు లేదని కూడా వార్తలు వచ్చాయని అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపారేసింది. అప్పటికే శ్రీముఖి లవ్ లో ఉందని అందుకే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకుందని వార్తలు వినిపించాయి.
ఇవన్నీ పక్కన పెడితే తన ఇన్ స్టాతో ఎప్పుడూ ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు అందు బాటులో ఉంటుంది. అప్పుడప్పుడు ట్రెండీ లుక్స్ తో అదరగొడుతుంది. ఇటీవల ఆమె లంగాఓనిలో మరిసింది. బ్లాక్ అండ్ మిక్స్ డ్ కలర్స్ లంగాఓనిలో పరువాలను చూపి చూపకుండా దాస్తూ అనందాన్ని పంచింది. ఈ పిక్స్ ను చూసిన నెటిజన్లు ట్రెండీ గర్ల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.