Anchor Sreemukhi : లవ్ ఫెయిల్యూర్, పెళ్లి గురించి సీక్రెట్స్ రివీల్ చేసిన శ్రీముఖి.. ఫ్యాన్స్ షాక్!
Anchor Sreemukhi : టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న టాప్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు.. ఈ భామ గురించి తెలియని వారు లేరు.. రాములమ్మగా అందరి మదిలో చోటు సంపాదించుకున్న శ్రీముఖి ఈ మధ్య కాలంలో మరింత పాపులర్ అయ్యింది.. ఈ భామ బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చాక ఇండస్ట్రీలో మరింత ఫేమస్ అయ్యింది.
దీంతో ప్రస్తుతం యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ రెండు చేతుల సంపాదిస్తుంది.. యాంకర్ గా పలు ప్రోగ్రామ్స్ చేస్తూనే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఫంక్షన్స్, బుల్లితెర ఈవెంట్స్ అంటూ క్షణం తీరిక లేకుండా స్టార్ యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకుంది..
అయితే ఈమె కెరీర్ పరంగా దూసుకుపోతుంది.. కానీ ఆమె ఫ్యాన్స్ లో ఒక విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా పోతుంది. ఈమెకు ఇంత వయస్సు వచ్చిన పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా ఉంటుంది.. అందుకు కారణం ఆమె ప్రేమలో ఉందని కొందరు అంటుంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యింది అందుకే పెళ్లి చేసుకోవడం లేదని మరికొందరు అంటున్నారు..
తాజాగా ఇదే విషయం ఒక అభిమాని అడుగగా ఈమె సమాధానంగా ”ఒక్క నిముషం ఆలోచించకుండా తడుముకోకుండా వెంటనే బొచ్చెడు సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను” అంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.. పెళ్లి ఎప్పుడు అని మరో అభిమాని అడుగగా దానికి మాత్రం రిప్లై ఇవ్వలేదు.. మరో అభిమాని పెళ్లి అయితే యాంకరింగ్ మానేస్తారేమో అందుకే పెళ్లి చేసుకోకండి అనగా అందుకు ఈమె పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం.. పెళ్ళికి యాంకరింగ్ కు సంబంధం లేదు పెళ్లి అయినా యాంకరింగ్ చేస్తా” అంటూ చెప్పుకొచ్చింది..