Sreeleela Mother : స్టార్ డైరెక్టర్ కి పళ్ళు రాలిపోతాయి అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి!
Sreeleela Mother : తెలుగు అమ్మాయిలు మన సినిమా ఇండస్ట్రీ లో స్టార్స్ కాలేరు అనే అపోహకి గతం లో రంభ వంటి హీరోయిన్లు చెక్ పెట్టారు. నేటి తరం రంభ లాగ పేరు తెచ్చుకున్న మరో అచ్చ తెలుగు అమ్మాయి శ్రీలీల కూడా అలాంటి రూమర్స్ కి చెక్ పెట్టింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా నటించిన ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన శ్రీలీల తొలిసినిమా తోనే ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. ఇక రెండవ సినిమా ‘ధమాకా’ తో ఆమె ఏ రేంజ్ కి వెళ్లిపోయిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం.
ఎక్కువ శాతం డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా స్టార్ డైరెక్టర్స్ శ్రీలీల ని హీరోయిన్ గా తీసుకునేందుకే అమితాసక్తిని చూపిస్తున్నారు. కారణం యూత్ లో ఆమెకు ఉన్న క్రేజ్. రీసెంట్ గా విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటించి మరో డిజాస్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకున్న శ్రీలీల కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చూస్తోంది.
సినిమాలతో పాటుగా ఆమె మెడిసిన్ కూడా చదువుతూ బిజీ గా గడుపుతూ ఉంటుంది, ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పరీక్షలు సమీపించడం తో ఆమె సినిమాలకు తాత్కాలిక విరామం ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే పరీక్షలకు వెళ్లే ముందు ఈమె ఒక నిర్మాతకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. రీసెంట్ గానే ఆ సినిమాకి సంబందించిన స్టార్ డైరెక్టర్ శ్రీలీల ఇంటికి వెళ్లి కథని వినిపించాడట.ఈ కథలో కొన్ని సన్నివేశాల్లో చాలా బోల్డ్ గా కనిపించాలని, హద్దులు దాటి ప్రవర్తించాలని, బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయని చెప్పాడట. తన ప్రతీ కథ ని వినేటప్పుడు తన అమ్మ ని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటుంది శ్రీలీల, తనతో పాటుగా ఆమె కూడా కూర్చుంటుంది.
అయితే ఈ డైరెక్టర్ ఆ బోల్డ్ సన్నివేశాలు చెయ్యాలని చెప్పినప్పుడు శ్రీలీల అమ్మ స్వర్ణలత మా అమ్మాయి అలాంటి సన్నివేశాల్లో నటించదు, ఇంకోసారి ఇలాంటి కథలతో మా ఇంటికి వచ్చావంటే చెప్పుతో కొడతాను అని వార్నింగ్ ఇచ్చి పంపింది అట. ఈ సంఘటన జరిగిన దగ్గర నుండి శ్రీలీల చాలా డల్ గా ఉంటుందని, డైరెక్టర్ పట్ల తన తల్లి అలా మాట్లాడడం పై ఇంట్లో ఆమె గొడవలు కూడా పెట్టుకుందని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.