Sreeleela : తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి శ్రీలీల. పెళ్ళిసందడి సినిమాతో శ్రీకాంత్ కొడుకు రోషన్ తో పాటు లాంచ్ అయినా ఈ కుర్ర హీరోయిన్ అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించండి. అమ్మాయిలో చాలా టాలెంట్ ఉంది. అందంగా ఉంది, డ్యాన్స్ అదరగొడుతుంది భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుంది అనుకున్నారు.
అందరూ అనుకున్నట్టుగానే ఈమె రెండవ సినిమాతోనే ఆ రేంజ్ కి వెళ్ళిపోయింది. ధమాకా చిత్రం సూపర్ హిట్ అవ్వడం తో ఈమె ఎవ్వరు అందుకోలేని రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆ సినిమాలో ఈమె వేసిన డ్యాన్స్ వేరే లెవెల్ లో ఉండడం వల్ల, మాస్ ఆడియన్స్ క్యూలు కట్టేసారు. ఫలితంగా రవితేజ కి మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా పడినట్టు అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత శ్రీలీల 10 సినిమాలకు సంతకం చేసింది.
అందులో ‘స్కంద’, ‘భగవంత్ కేసరి, ‘ఆదికేశవ’, ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ మరియు ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిల్లో ‘భగవంత్ కేసరి’ చిత్రం ఒక్కటే కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ముట్టుకున్న ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతుండడంతో ఇప్పుడు ఈ క్రేజీ కుర్ర హీరోయిన్ తో సినిమాలు చెయ్యడానికి భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. అంతే కాకుండా ఈమె విజయ్ దేవరకొండ తో ఒక సినిమా, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు చెయ్యడానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో నుండి ఈమెని తప్పించిన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా కొత్త ఆఫర్లు కూడా ఈమెకి రావడం లేదు. దీంతో కొంతకాయలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది శ్రీలీల. రీసెంట్ గానే ఈమె ఒక కన్నడ టీవీ షో కి యాంకర్ గా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షో నిర్వాహకురాలు ఈమె తల్లి స్వర్ణలతకి బెస్ట్ ఫ్రెండ్ అట. ఆమె స్వయంగా శ్రీలీల ని యాంకరింగ్ చెయ్యమని కోరడం తో వెంటనే ఒప్పుకొని యాంకరింగ్ ప్రారంభించింది. దీంతో అందరూ శ్రీలీల ని సినిమాలు లేక యాంకర్ గా మారిపోయింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.