Sreeja Cancel to Divorce : శ్రీజా విడాకులు రద్దు చేసుకుని భర్తతో కలవబోతుందా.. కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడా?

Sreeja Cancel to Divorce

Sreeja Cancel to Divorce her Husband

Sreeja Cancel to Divorce : సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఎంత కామనో నచ్చకపోతే విడాకులు తీసుకోవడం కూడా అంతే కామన్.. ప్రేమించుకుని అభిప్రాయ బేధాలతో విడిపోయిన సెలెబ్రిటీలు ఉన్నారు.. అదే విధంగా పెళ్లి చేసుకుని మనస్పర్థల కారణంగా విడిపోయిన సెలెబ్రిటీలు సైతం ఉన్నారు.

ఇండస్ట్రీలో ఇదంతా సర్వసాధారణం అంటూ సాధారణ ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీలు చాలా మంది విడాకులు తీసుకుని విడిపోయారు.. సమంత, నాగ చైతన్య జంట ధనుష్, ఐశ్వర్య జంట, నిహారిక చైతన్య జంట కూడా విడిపోయారు..

మరి మెగా ఫ్యామిలీలో నిహారికతో పాటు చిరంజీవి చిన్న కూతురు శ్రీజా కూడా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. ముందుగా ఈమె ప్రేమించి ఇంట్లో ఎవ్వరితో చెప్పకుండా పెళ్లి చేసుకుని అతడితో ఒక పాప పుట్టిన తర్వాత విడిపోయింది. ఇక చిరంజీవి చిన్న కూతురును క్షమించి మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేసారు.

అయితే రెండవ పెళ్లి పెద్దలు కుదిర్చినప్పటికీ వీరికి పొసగలేదు.. శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ మొదటి ఐదేళ్లు బాగానే ఉన్నారు. మళ్ళీ ఈ జంటకు ఒక పాప జన్మించింది. కానీ అనుకోని కారణాల వల్ల  వీరు విడిపోయారు.. అయితే వీరి పాప కొద్దీ రోజులు కళ్యాణ్ దగ్గర ఉంటే మరికొన్ని రోజులు శ్రీజ దగ్గర ఉంటుంది..

అయితే తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సరోజ, కళ్యాణ్ వారి విడాకులను రద్దు చేసుకుని ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చూస్తుంటే కూడా ఇదే నిజం అనేలా ఉంది.. ఇదే నిజమైతే ఇది సంతోషించే విషయం అనే చెప్పాలి. మరి విడాకుల రద్దు విషయం నిజమో కాదో తెలియాల్సి ఉంది..

TAGS