BRS Afraid : ఓట్ల చీలిక.. బీఆర్ఎస్ భయమంతా బీజేపీనేనా..?

BRS Afraid

BRS Afraid

BRS Afraid : తెలంగాణ ఎన్నికలకు మరో పది రోజుల గడవు మాత్రమే మిగిలి ఉంది. ప్రచార పర్వానికి మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక ఈ సమయంలో అన్ని పార్టీలు ఈసారి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్ దూసుకువస్తున్నది. అయితే గ్రామాల్లో సైలెంట్ ఓటర్లు ఎవరివైపు తిరుగుతారనేది ఇప్పుడు కీలకంగా మారింది.

ఇదిలా ఉంచితే ఈ సారి బీఆర్ఎస్ ను బీజేపీ భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ సారి కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీనియర్లు విభేదాలను పక్కనబెట్టి మొదట పార్టీ గెలుపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో ముందుకెళ్తున్నారు. ఇక ఈ ఆటలో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ చీల్చే అవకాశమున్నదనే టాక్ వినిపిస్తున్నది. గతంతో పోల్చుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని బయట టాక్ నడుస్తున్నా, ఇక్కడ ఓట్ల చీలికే కీలకంగా కానుంది. ఇది రెండు రకాలుగా కనిపిస్తున్నది.

బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటే అనేది నిజమైతే, ఇన్నాళ్లు అధికార పార్టీ చేతితో ఇబ్బంది పడ్డవారు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. లేదంటే బీఆర్ఎస్ కు పడే ఓటును బీజేపీ చీల్చినా ఇక్కడ ప్రమాదకరమే అవుతుంది. ఇలాంటి సమయంలో బీజేపీ తెలంగాణ బలపడితే తమకు నష్టమే చేకూరుస్తుందని బీఆర్ఎష్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఏపీలో బీజేపీ బలపడితే తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టమో, తెలంగాణలో బీజేపీ బలపడితే బీఆర్ఎస్ కు అంత నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఇదే సమయంలో బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ అంశం బీజేపీ కి కొంత కలిసి వస్తున్నది. దీంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అనుకోని రీతిలో పుంజుకున్నట్లు కనిపిస్తున్నది. ఇక తెలంగాణ పోరులో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ చీల్చుకుంటే, కాంగ్రెస్ బయట పడే చాన్స్ కూడా లేకపోలేదు. ఈ దశలో త్రికోణ పోటీలో అధికార పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

TAGS