Manda Krishna Madiga : మాదిగల ఆత్మీయ సమావేశం.. విశేష స్పందన – హాజరైన మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga
Manda Krishna Madiga : క్రోసూరు మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంద కృష్ణ మాదిగ, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ గతంలో సామాజికంగా దగాపడ్డ మాదిగ జాతికి న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, ఐక్యంగా మాదిగలంతా కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.
అనంతరం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ మే 13వ తారీకున జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ఉద్యోగ అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
టీడీపీ గెలిస్తే మాదిగలకు దామాషా ప్రకారం రాజకీయంగా, ఆర్థికంగా అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తుందన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాదిగ సామాజిక వర్గ ముఖ్య నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.