Janasena : గత ఎన్నికల్లో (2019) ఒక్కటంటే ఒక్క సీటు వచ్చిన జనసేన పార్టీ ఈ సారి 15 నుంచి 18 స్థానాలు దక్కించుకుంటుందని ఏపీలో వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి ఒక్క రోజు కావడంతో జనసేన స్ట్రైక్ రేట్ పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం జనసేన పార్టీ చాలా కష్టపడింది. టీడీపీ, బీజేపీలతో జతకట్టిన జనసేన తమ అభ్యర్థులను బరిలోకి దింపిన మెజార్టీ చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేస్తోంది. పార్టీ విజయావకాశాలపై బెట్టింగులు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని విషయాలపై పందెం వేయడం మామూలే. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో క్రికెట్, ఐపీఎల్, సినిమా కలెక్షన్లపై బెట్టింగ్ లు సర్వ సాధారణం. కానీ, తాజా బెట్టింగ్ ఎన్నికల్లో జనసేన పార్టీ స్ట్రైక్ రేట్ పై ఉందని తెలిసింది.
పిఠాపురం, మంగళగిరి, కుప్పం తదితర హైప్రొఫైల్ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు. ఎంత మెజార్టీతో గెలుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీ 98 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఈ అంశంపై పందేలు వేసుకుంటున్నారు. జనసేన మద్దతుదారులు 80 శాతం స్ట్రైక్ రేట్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
దీని ప్రకారం జనసేన పోటీ చేసిన మొత్తం సీట్లలో దాదాపు 15-18 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడే అది విజయం అవుతుంది. జనసేనలో కొందరు నేతలు కూడా తమ అంతర్గత సర్వేలు దాదాపు 15 స్థానాల్లో జనసేనకు ఎడ్జ్ ఇస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ‘జనసేన స్ట్రైక్ రేట్’పై జరుగుతున్న ఈ పందేలు వాటాదారులకు లాభాలు తెచ్చిపెడతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.