Kartika Purnima : కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటో తెలుసా?

Kartika Purnima

Kartika Purnima

Kartika Purnima : హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో కార్తీక పౌర్ణమి ముఖ్యమైనది. ఈ రోజు దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. శివ కేశవులకు ఇద్దరికి ఇష్టమైన మాసంగా కార్తీక మాసంను గుర్తిస్తారు. అందుకే శివ కేశవుల ఆలయాలు కిటకిటలాడతాయి. దీపాలతో కాంతులు వెదజల్లుతాయి. కార్తీక మాసం రోజు 365 వత్తులతో దీపాలు వెలిగిస్తే సాక్షాత్తు పరమశివుడిని దర్శించుకున్నట్లే అని చెబుతారు.

పూర్వం కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసున్ని సంహరించిన రోజే కార్తీక మాసంగా భావిస్తారు. ఈ రోజు పరమశివుడు సంతోషంతో డ్యాన్స్ చేశాడట. అందుకు కార్తీక పౌర్ణమి జరుపుకునేవారట. ఇలా ఈ పండు విశిష్టత గురించి తెలుసుకుంటే ఇంకా ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. కార్తీక పౌర్ణమి శివుడికి, విష్ణువుకు చాలా ఇష్టమైన రోజు కావడంతో దీపాలు వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసే పాపాలు పటాపంచలవుతాయని నమ్ముతుంటారు.

కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి దేవాలయానికి వెళ్లి దీపాలు వెలిగించి దేవుడిని వేడుకోవడం వల్ల మనకు పుణ్య ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. దీపపు కాంతి మనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని అంటుంటారు. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయి. భూత, ప్రేత పిశాచాలు బాధలను నివారిస్తాయి.

జ్వాతా దర్శనం మనుషులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక పౌర్ణమి విష్ణువుకు కూడా ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఆయనను కూడా కొలుస్తారు. ఈ రోజు రుద్రాభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల శ్రేష్టమని చెబుతుంటారు.

కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం వెలిగించాలి. రోజుకో వత్తిచొప్పున ఏడాదికి 365 రోజులుగా భావించి దీపం వెలిగిస్తారు. దీని వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందంటారు. కార్తీక పౌర్ణమి రోజు పొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించడం మంచిది. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్లే అని అనుకుంటారు.

కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఆకాశదీపాన్ని దర్శించుకుంటే ఆ పరమశివుడిని దర్శించుకున్నట్లే. ఈరోజు మహావిష్ణువు మత్స్యావతారంలో కనిపిస్తాడు. కార్తీక పౌర్ణమి రోజు ఐదునిమిషాలు చంద్రుడి కిరణాలు మన మీద పడటం వల్ల నరాలు, కళ్లు రిలాక్స్ అవుతాయి. కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపుల ఉండే దీపాన్ని వెలిగించడం మంచిది.

TAGS