Congress Manifesto : తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో

Congress Manifesto for Telangana
Congress Manifesto : తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనున్నారు. రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయనుందో ఆయన వెల్లడించనున్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్లు తదితర అంశాలకు మేనిఫెస్టోలో చోటు కల్పించనున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల మంత్రం పనిచేయడంతో లోక్ సభ స్పెషల్ మేనిఫెస్టోపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను హస్తం పార్టీ చేర్చింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ‘న్యాయ్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది.