KCR Bus : తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ బస్సుయాత్ర కొనసాగుతోంది. 17 రోజులు, 22 రోడ్ షోలతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే ప్రచార వాహనం అయిన బస్సు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ బస్సును యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో పిలిచే ఈ బస్సు కొత్త టెక్నాలజీతో ఆకట్టుకుంటోంది. ఈ బస్సులో లిఫ్ట్ ఏర్పాటు చేశారు.
అయితే గతంలో తుంటి ఎముక విరగడంతో సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం కర్ర సాయంతో నడుస్తున్నారు. రోడ్ షో సందర్భంగా బస్సు పైకి ఎక్కడానికి కేసీఆర్ కు ఇబ్బందిగా ఉండడంతో బస్సు లోపలి నుంచి పైకి వెళ్లడానికి లిఫ్ట్ ను వాడుతున్నారు. కేసీఆర్ లిఫ్ట్ లోనే పైకి వచ్చి, రోడ్ షో అనంతరం కిందికి వెళ్లిపోతున్నారు.