JAISW News Telugu

Purandeshwari : మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాం: పురందేశ్వరి

Purandeshwari

Purandeshwari

Purandeshwari : వంద రోజుల పాలనలో మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు  పురందేశ్వరి అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం మూడు విడతలుగా రూ.6 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పురందేశ్వరి మాట్లాడారు.

గడిచిన ఐదేండ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరిందని చెప్పారు. 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు పెట్టుబడుల బాధలు తీరాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలపై దృష్టి సారించి పెంచిందని తెలిపారు. సహకార రంగం పునరుజ్జీవనానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. బీజేపీ వంద రోజుల పాలనలో మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. 8 కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు పురందేశ్వరి చెప్పారు.

Exit mobile version