South Industry : భారతీయ సంస్కృతి అతి ప్రపంచంలో కెల్లా అతి పురాతనమైనది. ఇందులో నుంచి ఎన్నో ఇతిహాసాలు, గ్రంథాలు పుట్టుకచ్చాయి. రామాయణం, మహాభారతం లాంటి గొప్ప గొప్ప గాధలు ఉన్నాయి. దీనికి తోడు భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్ముడే స్వయంగా చెప్పిన భగవద్గీత ఉంది. ఇంతటి అద్భుతమైన చరిత్ర నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీయవచ్చు. కథల కోసం ఎక్కడికెక్కడికో తిరిగే కథా రచయితలను ఇందులో నుంచే మంచి మంచి కథలను వెతుక్కోవచ్చు. అలా చాలా వరకు కథలు కూడా పుట్టాయి.
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. గతానికి భిన్నంగా కథలను ఇతిహాసాలు, గ్రంథాలు, సంస్కృతి నుంచే తీసుకుంటున్నారు. వాటినే వర్తమానానికి, భవిష్యత్ కు మలిచి మరింత అందంగా చిత్రీకరించి విజయం సాధిస్తున్నారు. అలా చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు అన్నీ కూడా భారీ బడ్జెట్ తో రాగా.. అంతకు మించి హిట్ సాధించాయి. ఈ పురాణ కథలను సినిమాలుగా మలచడంలో దక్షిణాది డైరెక్టర్లు సక్సెస్ సాధిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళంలో అద్భుతమైన కథలు పుట్టుకస్తున్నాయి. అందులో ఒకటి రెండింటి గురించి తెలుసుకుందాం.
కాంతారా..
మనిషికి, ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణ, జమీందార్లు, రైతుల మధ్య జరిగే పోరాటాలు, భూమి, డబ్బు కోసం అంతులేని అన్వేషణ గురించిన కాలాతీతమైన కథ కన్నడం నుంచి వచ్చిన ‘కాంతారా’. కర్ణాటక సంస్కృతి, పురాణాల్లోని అంశాలను ఆ కథావస్తువుగా మలుచడంలో విజయం సాధించాడు డైరెక్టర్. తుళునాడు జానపదంలో భూత (దైవం అని కూడా పిలుస్తారు) అనే ఆచారం ద్వారా దేవతలను కొలుస్తారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టించింది.
‘కల్కి 2898 ఏడీ’
ఇటీవల రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’ కథ కూడా హిందూ గ్రంథాల బేస్ నుంచి తీసుకున్నదే. విష్ణువు పదో అవతారం ‘కల్కి’ భూమిపైకి వచ్చే కథాంశంతో తీర్చి దిద్దాడు నాగ్ అశ్విన్. ఇది పురాతన భారతీయ ఇతిహాసమైన మహాభారతం నుంచి కథను భవిష్యత్ కు లింక్ చేస్తూ తీసిన తీరు అద్భుతం. నాగి దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దిశా పటాని నటించారు.