Ranveer : రణవీర్ తో సినిమాలు వద్దంటున్న సౌత్ డైరెక్టర్లు
Ranveer : మొన్నటి వరకు బాలీవుడ్ లో సౌత్ రీమేక్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. ప్లాఫ్ లలలో ఉన్న సల్మాన్ ఖాన్ ను సౌత్ రీమేక్ సినిమాలే గట్టెక్కించాయి. పోకిరి సినిమాను వాంటెడ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు సల్మాన్. అలాగే అజయ్ దేవగన్ కూడా సూర్య తమిళ ప్రాంచైజీ మూవీ సింగంతో సక్సెస్ లు కొట్టాడు. అక్షయ్ కుమార్ సైతం దళపతి విజయ్ సినిమా తుపాకీ సినిమాను రీమేక్ చేసి హిట్ కొట్టాడు. మిస్టర్ పర్పక్ట్ అమిర్ ఖాన్ సైతం తమిళ మూవీ గజిని సినిమాను రీమేక్ చేసి ఇండియన్ సినిమా తెరపైన కనీవిని ఎరుగని హిట్ కొట్టాడు. బాలీవుడ్ కు తొలిసారి వంద కోట్ల మార్క్ సినిమా గా రికార్డు కొట్టాడు. ఇలా రీమేక్ సినిమాలతో బాలీవుడ్ స్టార్లు సక్సెస్ బాట పట్టారు. ఇక మణిరత్నం ఎప్పుడో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేశాడు. తమిళం నుంచి శంకర్, మురుగుదాస్ కూడా పలు సినిమాలు చేసి హిట్లు కొట్టారు. ఇదే కోవల్ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలితో కొత్త రికార్డు సృష్టించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా మరో భారీ హిట్టు కొట్టాడు. ప్రశాంత్ నీల్ సైతం కేజీఎఫ్ ప్రాంచైజీతో పాట సలార్ తో బంపర్ హిట్లు కొట్టాడు.
మొన్నటి దాకా సౌత్ రీమేక్ లు చేసిన బాలీవుడ్ స్టార్లు తమతో సినిమాలు చేయాలంటూ వెంట పడుతున్నారు.
ఈ ఏడాది హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా్యి. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో ఓ సినిమా ఓకే అయ్యిందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు.
రణవీర్ సింగ్ గతేడాది ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో కనిపించాడు. ఈ ఏడాది రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’ ‘డాన్ 3’ సినిమాలు రానున్నాయి. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ‘రాక్షస్’ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే రణవీర్ కూడా మూడు రోజులు షూట్ కూడా చేశాడు. అంతలోనే ఈ మెగా ప్రాజెక్ట్‌కు బై బై చెప్పాడని వార్తలు వచ్చాయి. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా రణవీర్, ప్రశాంత్ మధ్య విభేదాలు వచ్చాయని టాక్. ఈ రూమర్స్ పై ప్రశాంత్ వర్మ ఇటీవల మౌనం వీడాడు. రణ్‌వీర్ సింగ్‌కు తనదైన స్టైల్ ఉంది. అతను కారవాన్ (టీమ్)తో కార్యాలయానికి వచ్చాడు, కానీ దక్షిణాదిలో పని చేసే విధానం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఒక టీమ్ లా పని చేస్తారు. అతని లుక్ టెస్ట్ పూర్తి చేశామని చెప్పాడు. కానీ అరగంట షూటింగ్‌కి మూడు-నాలుగు రోజులు పట్టిందనే పుకార్లు ఎలా వచ్చాయో తనకు తెలియని చెప్పాడు. సృజనాత్మక విభేదాల కారణంగా రణవీర్, ప్రశాంత్ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
కొత్తేమీ కాదు..
రణ్ వీర్ సింగ్ సినిమా ఓకే అయ్యాక తప్పుకోవడం కొత్తేమీ కాదు. గతంలో తమిళ డైరెక్టర్ శంకర్ తో సైతం సినిమా ఓకే అయ్యాక ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. 2005లో వచ్చిన అపరిచితుడు సినిమాను శంకర్ రణ్ వీర్ సింగ్ తో చేయాలనుకున్నాడు. అంతా సెట్ అయ్యిందనుకున్న సమయంలో ఈ సినిమా రద్దయ్యింది. దీంతో సౌత్ సినిమా డైరెక్టర్లు నిలకడలేని రణ్ వీర్ సింగ్ తో సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడో లేదో చూడాలి.