Sonia Gandhi : నిజమే కదా.. తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్ర ప్రాప్తి కలిగించిన నాయకురాలు ఆమె. దశాబ్దాలుగా తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపించలేక నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్ పేయి లాంటి మహామహులే వెనక్కి తగ్గారు. ఎడతెగని సమస్యకు పరిష్కారం చూపి..కోట్లాది తెలంగాణ ప్రజలకు ఆమె ‘సోనియమ్మా’, ‘తల్లి సోనియమ్మా’ గా మారిపోయారు. ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియా.. రాజీవ్ గాంధీని ప్రేమ వివాహం చేసుకుని అత్తారిల్లు ఇండియానే తన సొంతఇల్లుగా మార్చుకున్న వనిత ఆమె. రాజీవ్ దుర్మరణం తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ.. భారత దేశ ఆత్మను అర్థం చేసుకున్నారు. ఇక్కడి ప్రజల యాసలు, భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు, సమస్యలు, బాధలు అర్థం పూర్తిగా అవగాహన చేసుకున్నారు.
అలాంటి నేపథ్యంలో 2004లో తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో, ఏపీలో అధికారంలోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత జరిగిన అన్నీ విషయాలు మన మదిలో మెదులుతుండేవి. కేసీఆర్ ఆమరణ దీక్షతో 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేశారు. ఇక తర్వాత ఏపీ, తెలంగాణల్లో వివిధ సంఘటనలు మనకు తెలిసినవే. ఎట్టకేలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ నిర్ణయం వల్లనే జూన్ 2న తెలంగాణ ఏర్పడింది.
సోనియమ్మ వల్లనే తెలంగాణ సాధ్యమైందని ప్రతీ తెలంగాణ బిడ్డ అనుకుంటాడు. తెలంగాణ పోరాటం కేసీఆర్ పాత్రే ప్రధానమైన.. వేరే ఏ పాలకుడు తీసుకోలేని నిర్ణయాన్ని సోనియా గాంధీ తీసుకుని తెలంగాణ ఇవ్వడం గొప్ప విషయం. అందుకే తెలంగాణ జనాలకు ఆమె అంటే ఓ ఎమోషన్. ఆమెను ఈ గడ్డ ఎన్నటికీ మరవదనే చెప్పాలి. సోనియా ప్రాధాన్యాన్ని చెప్పే ఎమోషనల్ వీడియోలను టీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో ఓ సభలో తీసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో సోనియాకు సభపై దారిచూపుతూ రేవంత్ రెడ్డి తీసుకెళ్లడం అందరి గుండెల్లో ఒకింత తన్మయత్వానికి గురిచేస్తోంది. మరి ఆ వీడియో చూడండి మరి..