JAISW News Telugu

Son of Satyamurthy : సన్ ఆఫ్ సత్య మూర్తి పాప.. ఎలా మారిపోయిందో చూశారా.. అయితే ఓ లుక్కేయండి

FacebookXLinkedinWhatsapp
Son of Satyamurthy

Son of Satyamurthy

Son of Satyamurthy : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు పెద్దగా అయిపోయాక హిరోలు, హిరోయిన్లుగా మారి తమ లక్ ను మార్చుకుంటున్నారు. సన్ ఆప్ సత్యమూర్తి మూవీలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పుష్ప 2 సినిమాలోని సాంగ్ కు ఇన్ స్టా లో రీల్స్ చేసి అదరగొడుతుంది.

ఇప్పటికే బలగం బ్యూటీ కల్యాణ్ రామ్ హిరోయిన్ గా అవకాశాలు కొట్టేసింది. అల్లు అర్జున్ మొదటి మూవీ గంగోత్రిలో నటించి మెప్పించింది. సన్ ఆప్ సత్యమూర్తి మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అల్లు అర్జున్ అన్న కూతురిగా నటించిన చిన్నారి చాలా క్యూట్ గా ముద్దుగా.. బబ్లీగా కనిపిస్తుంది. ఈ చిన్నారికి పెద్దగా డైలాగ్స్ ఉండవు. కానీ సినిమాలో పాప ఎంత ముద్దుగా ఉందో అని అనుకున్నారు. ఈ పాప పేరే వర్ణిక.

అయితే వర్ణిక చాలా పెద్దగా మారిపోయింది. ఏకంగా ఇన్ స్టా గ్రాంలో రీల్స్ చేస్తూ అదరగొడుతుంది. సీనియర్ ఎన్టీఆర్ పాట అయిన అప్పుడు అనే పాటకు.. మరి ఇప్పుడు అంటూ ఆమె చేసిన రీల్స్ ను పార్ వర్డ్ చేస్తున్నారు. వర్ణిక పుష్ప 2 మూవీకి సంబంధించిన ఆడియో సాంగ్ ను రీల్ చేసింది. చూసేటి అగ్గి మాదిరి సామి అనే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

ఈ పాటకు దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక భాషల్లో ఈ మూవీని విడుదల చేయాలని పుష్ప 2 నిర్మాణ సంస్థ ఆలోచన చేస్తుంది. పుష్ప 2 మూవీ పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసేందుకు సినిమా ప్రొడ్యూసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 15 న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్ప 2 షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడమే ఒక కారణంగా కనిపిస్తోంది.

Exit mobile version