Homeguard : నా కొడుకునే అరెస్టు చేస్తారా..? మీ అంతు చూస్తా.. పోలీసులకు హోంగార్డ్ వార్నింగ్

Homeguard

Homeguard

Homeguard : పోలీస్ స్టేషన్ లో ఓ హోంగార్డు హల్ చల్ చేశాడు తన కొడుకునే అరెస్టు చేస్తారా..? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఘట్ కేసర్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చైన్ స్నాచింగ్ కేసులో అజ్మీరా వెంకటేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, టాస్క్ ఫోర్స్ డీసీపీ ఆఫీసులో హోంగార్డుగా వెంకటేష్ తండ్రి అజ్మీరా కిషన్ పనిచేస్తున్నాడు. దీంతో ఈరోజు (సోమవారం) ఉదయం అజ్మీరా కిషన్ ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన కుమారుడిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన కుమారుడిని జైలుకు పంపితే అంతు చూస్తానని పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అజ్మీరా కిషన్ పై ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

TAGS