Manu Bhakar : మను భాకర్, నీరజ్ చోప్రా మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ ?  

Manu Bhakar

Manu Bhakar and Niraj Chopra

Manu Bhakar : పారిస్‌ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మహిళా షూటర్‌ మను భాకర్‌, జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నీరజ్ ఒక రజత పతకాన్ని, మను భాకర్ రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం, కాంస్య పతకాలను కైవసం చేసుకున్న భారత అథ్లెట్లు మను భాకర్, నీరజ్ చోప్రా తమ తమ క్రీడలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం నీరజ్, మను భాకర్ ఒక కార్యక్రమంలో ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మను భాకర్ తల్లి తన కూతురిని చోప్రాతో కలిసి ఒక ఫొటోను క్లిక్ చేయమని కోరినట్లు కనిపిస్తోంది. మరొక వీడియోలో మను భాకర్ తల్లి జావెలిన్ స్టార్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నీరజ్ చోప్రా, మను భాకర్ సంభాషణ వీడియోతో అథ్లెట్లు ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉన్నారనే ఊహాగానాలు పెరిగాయి. వీడియోకు సంబంధించి సోషల్ మీడియా వినియోగదారులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక వర్గం వారి మధ్య ‘సంబంధం’ పుకార్లకు ఆజ్యం పోయడానికి ప్రయత్నించగా మరో వర్గం అలాంటి వారిని విమర్శించింది.  ఇద్దరూ సిగ్గుతో మాట్లాడుతున్నారు, అతని తల్లి ఫోటోలు తీస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  అలాంటి వ్యాఖ్యలను విమర్శిస్తూ మరో నెటిజన్ ఒక అబ్బాయి .. అమ్మాయి ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకుంటే దేశంలోని కొందరు ఏదో ఉందని ఊహించుకుంటూనే ఉంటారు అంటూ రాసుకొచ్చారు.

ఇద్దరూ పతకాలు సాధించారు
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ గేమ్, డబుల్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ గేమ్‌లో కాంస్య పతకాన్ని సాధించి  పారిస్ ఒలింపిక్స్‌లో భారత దేశ ఖాను తెరిచారు. ఆ తర్వాత జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు.

TAGS